కూకట్‌పల్లిలోని ఓ హెటల్‌లో డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య: ఆ హత్య కేసే కారణమా?
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్‌కు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడి నీట్ పరీక్ష కోసం చంద్రశేఖర్ కుటుంబం హైదరాబాద్ వచ్చి కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. కుమారుడి పరీక్ష ముగిసిన తర్వాత కుటుంబసభ్యులను ఇంటికి పంపించిన చంద్రశేఖర్ హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాగా, మెదక్ కారు దగ్ధం కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కటిక శ్రీనును చంపించింది చంద్రశేఖరేనంటూ ప్రచారం జరిగింది. ఇరువురి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే కటిక శ్రీను మర్డర్‌కు దారితీశాయంటూ వార్తలొచ్చాయి. చంద్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలంటూ స్థానికంగా ఆందోళనలు జరిగాయి.
ఈ నేపథ్యంలో డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. కటిక శ్రీను మర్డర్ కేసే డాక్టర్ సూసైడ్‌కు కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రశేఖర్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వీడిని మహిళ మిస్సింగ్ మిస్టరీ
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధిలో ఓ మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. జవహర్‌నగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల మహిళ , భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి కాప్రా వంపూగూడలో నివాసం ఉంటోంది. పది సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌లో ఓ హోటల్‌లో పనిచేసేది. అక్కడే వర్క్ చేస్తోన్న మారేడుపల్లికి చెందిన అశోక్(36)తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది.
అశోక్ కాప్రా సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాలితో గడిపేందుకు సమీపంలోనే మరో సెపరేట్ రూమ్ రెంట్‌కు తీసుకున్నాడు. తనకంటే 12 చిన్నవాడైనప్పటికీ ఆ మహిళ అశోక్‌తో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇటీవల అశోక్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో అశోక్ ప్రియురాలిని రెగ్యులర్‌గా కలవలేకపోతున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు ఇటీవల మరికొందరితోనూ సన్నిహితంగా ఉంటున్నట్లు అశోక్‌కు తెలిసింది. తనను మోసం చేసిన ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సెప్టెంబర్ 5 తేదీన ఆమెను తన రూమ్‌కి రమ్మని చెప్పాడు. దీంతో ఆ మహిళ అక్కడికి వెళ్లింది. ఇంట్లో చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నానని మనవరాలికి చెప్పింది. వెళ్లిన మనిషి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. రాత్రయినా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అశోక్‌పై అనుమానం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమెను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకొన్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట్ అటవీ ప్రాంతంలో వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అశోక్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Recommended Video
మేడ్చల్ శివారు అత్వెల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్, టాటా ఏస్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications