దసరా సెలవులు.. స్కూల్స్ తెరవొద్దు, కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
దసరా.. ఒకరోజు ముందు వచ్చే బతుకమ్మ పండగ, తెలంగాణలో పండగే పండగే. దసరాకు ప్రయారిటీ ఇస్తూ ఎక్కువ రోజులు సెలవు ఇస్తారు. అయితే కరోనా వైరస్ వల్ల ఆ పరిస్థితి లేకపోయింది. దాదాపు ఏడాదిన్నర నుంచి స్కూల్స్ మూసివేసి ఉన్నాయి. వైరస్ కాస్త శాంతించడంతో.. స్కూల్స్ పున: ప్రారంభం అయ్యాయి. అలా ఓపెన్ అయ్యాయో లేవో.. అప్పుడే సెలవులు వచ్చేశాయి. అంతకుముందు సెలవులు అంటే.. ఇంట్రెస్ట్ ఉండెదో ఏమో కానీ.. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికీ కొందరు ఆన్ లైన్ క్లాసులనే వింటున్నారు.
తెలంగాణలోని పాఠశాలలకు రేపటి నుంచి (6వ తేదీ) దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు మాత్రం13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాలను విద్యాసంస్థలు పాటించాలని... పట్టించుకోకుండా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలు దాదాపు 18 నెలల తర్వాత ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. దానిపై ఐసీఎంఆర్ క్లారిటీ ఇచ్చింది. జనవరి నుంచి ఏప్రిల్‌లో వస్తోందని హెచ్చరించింది. కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
Recommended Video
డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications