JBS: వరుస సెలవులు.. ప్రయాణికులతో రద్దీ మారిన రైల్వే, బస్ స్టేషన్లు..!
హైదరాబాద్ లో తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా అనేక మంది వచ్చి పని చేస్తుంటారు. అయితే సెలవులు వస్తే వీరంతా పల్లె బాట పడుతుంటారు. తాజాగా వరుస సెలవులు రావడంతో బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం, రేపు వరలక్ష్మి వ్రతం, శని, ఆదివారాలు వీకెండ్, సోమవారం రాఖీ ఇలా వరుసగా సెలువులు వచ్చాయి. అయితే ఇందులో ఏవీ కూడా పబ్లిక్ హాలీ డే కావు.
సాఫ్ట్ వేర్ వారికి శని, ఆదివారం సెలువులు ఉంటాయి. గురువారం సెలవు.. శుక్రవారం, సోమవారం లీవ్ పెడితే వరుసగా సెలువులు వస్తాయి. అలాగే పలు పాఠశాలలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించారు. దీంతో జేబీఎస్ బస్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో ఊరు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వెళ్ల బస్సుల్లో ప్రయాణికులు నిండిపోయారు.

చాలా మంది బస్సులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ నిండిపోయింది. విజయవాడ వైపు వెళ్లే బస్సుల్లో ఖాళీ లేకుండా ఉన్నాయి. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది సొంతూళ్ల బాట పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పబ్లిక్ బస్సులు, రైళ్లలో ముందే బుక్ చేసుకున్నారు.
బుక్ చేసుకోకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ వెళుతున్న ప్రయాణికులు సీట్ల కోసం పోరాటం చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ ఏరియాల్లో గురువారం ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది. ఏపీకి వెళ్లే వారితో ఎల్ బీనగర్ బస్టాప్ కూడా రద్దీగా మారింది. సెలవులకు ఊరు వెళ్తున్న వారికి పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. డబ్బు, బంగారు నగలు సహా విలువైన వస్తువులను ఇళ్లలో పెట్టుకోకూడదని కోరుతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications