సింగం స్టైల్ వద్దు: ప్రేమానురాగాలే ముద్దు: రిటైర్డ్ తరువాత కూడా: యంగ్ ఐపీఎస్‌లతో మోడీ
హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. దేశ రాజధాని నుంచి వీడియో కార్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి మాట్లారు. స్ఫూర్తినింపారు. ప్రతి సంవత్సరం తాను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో ముఖాముఖి కలుసుకుంటానని, కరోనా వ్యాప్తి చెందుతోన్నందు వల్ల ఈ సారి తాను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నానని అన్నారు. తన పదవీ కాలంలో తప్పకుండా కలుసుకుంటానని భరోసా ఇచ్చారు.

దీక్షాంత్ పరేడ్‌లో మోడీ
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లబ్ భాయ్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు. దీక్షాంత్ పరేడ్ అనంతరం మోడీ ప్రసంగించారు. ప్రజలతో సన్నిహితంగా మెలగాలని సూచించారు. సింగం స్టైల్ వల్ల పెద్దగా ప్రభావం ఉండబోదని అన్నారు. ప్రజలను ప్రేమానురాగాలతో చూడాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు ఆద్యులు కావాలని అకాంక్షించారు. ప్రజలతో సన్నిహితంగా మెలిగినప్పుడే సుదీర్ఘకాలం వారు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆ పేరు ప్రఖ్యాతులు నిలిచిపోతాయని చెప్పారు.

చిత్తశుద్ధి తప్పనిసరి..
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తోన్న సమయంలో కొందరు యువ ఐపీఎస్ అధికారులు తనను కలుసుకునే వారని, వారి కళ్లల్లో దేశం పట్ల బాధ్యతను, చిత్తశుద్ధనీ చూశానని అన్నారు. తొలిసారిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కొందరు ఐపీఎస్ అధికారులు చూపిన చొరవను తాను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, కానిస్టేబుల్ స్థాయిలో కూడా నిఘా బలోపేతం కావాలని అన్నారు. దురదృష్టశావత్తు ఇప్పుడా పరిస్థితులు లేవని అన్నారు.

అత్యాధునిక వ్యవస్థ..
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ కూడా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను అందిపుచ్చకుంటోందని అన్నారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా కేసులను పరిష్కరించడంలో నైపుణ్యాన్ని సాధించిందని చెప్పారు. తన ప్రాంతంలో ఐపీఎస్ అధికారులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో పోలీసు వ్యవస్థ తన ముద్రను వేసిందని అన్నారు. శిక్షణను పనిష్మెంట్‌గా భావించుకోనక్కర్లేదని, ప్రతి దశలోనూ శిక్షణ అవసరం అవుతుందని చెప్పారు.

మిషన్ కర్మయోగిలో భాగం..
తనకు తెలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ఉద్దేశపూరకంగా శిక్షణ విభాగాన్ని ఎంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో సంపూర్ణ మార్పులను తీసుకుని రావడానికి తాము మిషన్ కర్మయోగి ప్రాజెక్టును ప్రకటించామని చెప్పారు. దీనిద్వారా పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల పనితీరును ఏ మాత్రం విస్మరించలేనిదని మోడీ చెప్పారు. లాక్‌డౌన్ విధించిన సమయంలో పోలీసులు ఫ్రంట్‌లైన్ వారియర్లుగా సేవలు అందించారని అన్నారు.












Click it and Unblock the Notifications