Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. నరసింహాస్వామి దర్శనానికి 2 గంటల సమయం..!
కార్తీక సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటాలడుతన్నాయి. యాదగిరి గుట్టకు భారీగా భక్తులు తరలి వచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. నరసింహాస్వామి దర్శనానికి సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలొచ్చారు.
పుణ్య స్నానాలు
మంగళవారం సూర్య గ్రహణం ఉండడంతో సోమవారమే పలు ప్రాంతాల్లో భక్తులు నదుల్లో పుణ్యా స్నానాలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఇక మంగపేట పుష్కరఘాట్ లోనూ గోదావరి నదిలో నదీ స్నానాలు ఆచరించిన భక్తులు, అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు.

తిరుమలలో భక్తుల రద్దీ
ఏపీలోని పలు ఆయాల్లో భక్తులు తాకిడి కొనసాగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమరావతి లోని కృష్ణా నది తీరాన నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కార్తీక రెండవ సోమవారం సందడిగా మారింది. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో భక్తజనంతో పోటెత్తింది. రామప్ప ఆలయంలోనూ, పాలకుర్తి సోమేశ్వరాలయం లోనూ భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు.

ఆలయం మూసివేత
మంగళవారం చంద్రగహణం సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని ఓపెన్ చేసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపట్టనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications