సింగరేణి కార్మికులకు దసరా కానుక: భారీగా బోనస్, ఒక్కొక్కరికి ఎంతంటే?

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా భారీగా బోనస్ లభిస్తోంది. సింగరేని లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు అడ్డంకి తొలగింది. పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం ద‌స‌రా బోన‌స్‌గా రూ. 711 కోట్లు విడుదల చేసింది. . 42 వేల మంది సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 1.53 ల‌క్ష‌ల చొప్పున జ‌మ చేయ‌నుంది. ఒకటి రెండు రోజుల్లో ద‌స‌రా పండగ అడ్వాన్స్ కూడా చెల్లించే అవకాశం ఉందని సింగరేణి వర్గాలు తెలిపాయి.

 dussehra bonus released for singareni workers.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించ‌నున్న‌ట్టు సింగ‌రేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు దసరా కానుక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దసరా కానుకను ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శనివారం(అక్టోబర్ 21) డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ విడుదల కానుంది.

మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిపికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవీ విరమణ సమయంలో మూల వేతనంతో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+