హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డస్ట్ బిన్ లు సైతం ఆకర్షిస్తాయి, అందర్నీ చైతన్య పరుస్తాయి : జీహెచ్ఎంసీలో బాటిల్ మోడల్ డస్ట్ బిన్స్ !!

|
Google Oneindia TeluguNews

సాధారణంగా డస్ట్ బిన్ అంటేనే అదోలా ముఖం పెట్టి ఆమడ దూరంలో నుంచుని చెత్త విసిరేస్తాం. కానీ హైదరాబాద్ నగరంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లు ఇప్పుడు అందరి చూపును వాటివైపు తిప్పేలా చేస్తున్నాయి. అంతేకాదు ఆ డస్ట్ బిన్ లు చూసిన ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.

జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!

ఎన్టీఆర్ మార్గ్, పివి మార్గ్ లో వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లు

ఎన్టీఆర్ మార్గ్, పివి మార్గ్ లో వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లు

నగర సుందరీకరణ పనుల్లో భాగంగా జిహెచ్ఎంసి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ మార్గ్, పివి మార్గ్ లో ఏర్పాటు చేసిన వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా పరిరక్షించడం కోసం, నగరవాసుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అతిపెద్ద వాటర్ బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసి. మంచి నీటిని తాగి, అలాగే కూల్ డ్రింక్ తాగి బాటిల్స్ ఎక్కడపడితే అక్కడ విసరకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఐరన్ తో చేసిన అతిపెద్ద వాటర్ బాటిల్ డస్ట్ బిన్ లను ఏర్పాటు చేశారు.

 ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ బాటిల్స్ పడేయకుండా బాటిల్ మోడల్ డస్ట్ బిన్స్ తో చైతన్యం

ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ బాటిల్స్ పడేయకుండా బాటిల్ మోడల్ డస్ట్ బిన్స్ తో చైతన్యం

బాటిల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం తప్పని అర్థమయ్యేలా బాటిల్ నమూనా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ పడెయ్యకుండా నిర్దేశిత ప్రదేశంలోనే వేయాలని పర్యాటకులను చైతన్యపరచడం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో జిహెచ్ఎంసి అధికారులు ఈ వినూత్నమైన డస్ట్ బిన్ లను ఏర్పాటుచేసి అందరిని ఆలోచింపచేస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు నగర సుందరీకరణపై కూడా దృష్టి సారిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తుంది.

సరదా పడుతున్న పిల్లలు, ఫోటోలకు ఫోజులు .. మార్పు మంచిదేగా !!

సరదా పడుతున్న పిల్లలు, ఫోటోలకు ఫోజులు .. మార్పు మంచిదేగా !!

ఇక అతి పెద్ద బాటిల్ మోడల్ డస్ట్ బిన్ లను చూసిన పిల్లలైతే దాంట్లో బాటిల్స్ పడేయడానికి తెగ సరదా పడుతున్నారు. సహజంగా డస్ట్ బిన్ అంటే చీదరించుకునే వాళ్ళు కూడా, ఇక అతి పెద్ద బాటిల్ మోడల్ డస్ట్ బిన్ ల దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అంటే అవి ఎంతగా ఆకట్టుకుంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకపక్క అందంగా ప్రత్యేక ఆకర్షణ గా కనిపిస్తూ, మరోపక్క ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ఈ డస్ట్ బిన్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మార్పు కోసం చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం . నగరాన్ని శుభ్రంగా ఉంచటంలో నగర వాసులు కీలక భూమిక పోషించాలని ఆశిద్దాం.

English summary
It is a known fact that GHMC has embarked on innovative initiatives as part of city beautification works. The water bottle model dust bins set up at NTR Marg and PV Marg in this order are now impressing everyone. To protect the Hussain Sagar from pollution, GHMC has set up the largest water bottle model dust bins to bring awareness among the city people. Large water bottle dust bins made with iron have been set up to bring awareness among the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X