టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన 15 మంది బ్యాంక్ ఖాతాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. నిందితులు ఖాతాలు కలిగిన బ్యాంకులకు ఈడీ లేఖ రాసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి వివరాలు తీసుకున్న తర్వాత ఈడీ తాజా కేసు నమోదు చేయడం గమనార్హం.

 ED filed money laundering case on TSPSC paper leakage issue.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు: నాంపల్లి కోర్టులో రేణుకకు చుక్కెదురు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో ఏ-3 నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని, చిన్నారుల బాగోగులు చూసుకునేవారు లేరని రేణుక పిటిషన్లో పేర్కొంది.

పేపర్ లీకేజీతో తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని, కేవలం నేరాభియోగాలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కేసు విచారణ దశలో ఉన్నందున రేణుకకు బెయిల్ ఇవ్వొద్దని సిట్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ క్రమంలో రేణుక బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+