గుడ్ న్యూస్: ఈ ఏడాది ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పు లేదు..
ఇంజినీరింగ్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించింది. ఫీజులకు సంబంధించి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు పాత ఫీజులనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించింది. దీంతో చాలామంది విద్యార్థులకు మేలు జరగనుంది. అసలే కరోనా.. ఆపై ఇబ్బందులతో మిడిల్ క్లాస్, పేదలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించిన ఫీజులను పెంచే దిశగా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీలు కూడా తమ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా ఫీజులను పెంచాల్సిందేనని కమిటీని కోరాయి. కరోనా నేపథ్యంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయిన పరిస్థితులపై సోమవారం నాటి సమావేశంలో కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులనే కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.

గతేడాది వసూలు చేసిన ఫీజులనే ఆయా కళాశాలలు ఈ ఏడాది కూడా వసూలు చేయనున్నాయి. అంతకుమించి వసూల్ చేసే అవకాశం లేదు. కరోనా వల్ల దాదాపు రెండేళ్లు మార్కెట్ అంతా స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్కెట్ కోలుకుంది. కానీ తర్వాత ఇప్పుడు మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కేరళలో ఒకరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంకీపాక్స్ సోకిన ఫస్ట్ పర్సన్ కోలుకున్న తర్వాత.. ఆ వెంటనే మరణం కలచివేస్తోంది. అయినప్పటికీ కరోనా మహమ్మారిని యావత్ ప్రపంచం ధీటుగా ఎదుర్కొంది.












Click it and Unblock the Notifications