Hyderabad: వేడితో ఇబ్బంది పడుతున్నాం.. సెలవులివ్వాలని ఇంజినీరింగ్ విద్యార్థుల నిరసన..
వేసవి వేడి కారణంగా హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజిఐటి) యాజమాన్యం సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు నినాదాలు చేస్తూ కనిపించారు. మాకు సెలవులు కావాలి' అంటూ నినాదాలు చేశారు.
ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి సెలవులు ప్రకటించలేదు. హైదరాబాద్‌లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలకు రావడం ఇబ్బందిగా మారింది. గత కొన్ని వారాలుగా నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్‌లో వేసవి వేడి తీవ్రంగా ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

షేక్‌పేటతో పాటు గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురలో కూడా 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అందుకే నగరంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇప్పటికీ సెలవులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలకు సెలవులు ఇవ్వడంపై జేఎన్టీయూ కూడా ఆలోచించాలని విద్యార్థులు కోరుతున్నారు.
వడ దెబ్బతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీలకు సెలవులు ప్రటించాలని డిమాండ్ ఊపందుకోంటోంది. సెలవులు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications