హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులకు EOL.. గతంలో ఉన్న రూల్ మళ్లీ.. సజ్జనార్ సార్ మార్క్ వర్క్

|
Google Oneindia TeluguNews

సజ్జనార్ సార్.. ఎక్కడ ఉన్న సరే తన మార్క్ ప్రదర్శిస్తారు. లా అండ్ ఆర్డర్‌లో ఉంటే నేరస్తులకు సింహాస్వప్నం.. ప్రమోషన్‌లో భాగంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సంస్థ రూపు రేఖలు మార్చాలని అనుకుంటున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ఉన్న వెసులుబాటు కూడా అందజేస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు "ఎక్స్‌ట్రార్డినరీ లీవ్" ఇవ్వనుంది. ఏదైనా కారణంతో ఉద్యోగానికి హాజరుకాలేని పరిస్థితి ఉంటే, ముందే దరఖాస్తు చేసుకుంటే "ఎక్స్‌ట్రార్డినరీ లీవ్" ఇచ్చేందుకు సిద్ధం అంటూ ప్రకటించింది. డిపో మేనేజర్లు, డ్రైవర్, కండక్టర్లకు ఈ మేరకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ EOLకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

EOL will available rtc employees

ఎక్స్‌ట్రార్డినరీ లీవ్ కింద ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సమయంలో ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను తీసుకోగా.. వాటిలో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆర్టీసీలో ఉద్యోగులు, డ్రైవర్లు, కండెక్టర్లు మిగిలిపోతున్నారు. ప్రస్తుతం మూడు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు పనిచేయకపోయినా కూడా జీతాలు ఇవ్వవలసి వస్తుంది.

అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇలా సిబ్బంది మిగిలిపోతే సెలవులు ఇచ్చే అవకాశం ఉందని నిబంధనల్లో ఉంది. గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవు ఇచ్చేందుకు అంగీకరించింది. ఐదేళ్లపాటు ఉద్యోగం చేయకపోయినా కూడా ఉద్యోగం పదిలంగానే ఉంటుంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. [email protected] మెయిల్‌ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వివరించారు. సో సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని సజ్జనార్ చెబుతున్నారు.

English summary
EOL will available rtc employees now. rtc md implement old rule. most of the employees use the rule
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X