ఈటల రాజేందర్.. బీజేపీ గూటికేనట..? విసృత సంప్రదింపులతో ప్రాధాన్యం..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ చేరికకు సంబంధించిన అంశం మలుపులు తిరుగుతుంది. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటల రాజేందర్ ఆహ్వానం అందినట్లుగా సమాచారం వస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర నేతలతో చర్చలు జరిపిన ఈటల కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాతనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్న ఈటల.. ఎటూ తేల్చుకోలేక పోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈటల రాజేందర్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ నేతల నుంచి ఆఫర్లు కూడా అందుతున్నాయి. వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈటల డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Recommended Video
అంతకుముందు మాత్రం బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వివరించారు. మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానన్నారు. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి.. మళ్లీ హుజురాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. స్వతంత్రంగానే ఉంటానని.. ఎవరితో కలవబోనని ఈటల అన్నారు. కానీ అంతకుముందు ఈటల తనతో మాట్లాడరని కిషన్ రెడ్డి చెప్పడంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications