ఆ పాపం మీదే.. కేసీఆర్‌పై ఈటల రాజేందర్ విమర్శలు

సంధు దొరికితే చాలు.. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గత 45 రోజులుగా అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఎండీ వర్షానికి తడుస్తుందని అన్నారు. పండిన పంటలను కాపాడుకోవడానికి వరి కుప్పల మీద రైతుల ప్రాణాలు వదులుతున్న దీన స్థితి కనిపిస్తుందని తెలిపారు. ప్రభుత్వం బాధ్యత మరిచి ఏ ధర్నా చౌక్ ను నిషేధించిందో అదే ధర్నా చౌక్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత మరిచి కేంద్రం మీద నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.

అహంకారం..

అహంకారం..

సీఎం కేసీఆర్ అహంకారపు బుద్ధి వల్ల తెలంగాణ రైతాంగం కంటి మీద కునుకు లేకుండా చనిపోతున్నారని తెలిపారు. ఆ బాధ్యత కేసీఆర్‌దేనని అన్నారు. వడ్లకు ఐకేపీ, హమాలి చార్జీలు రవాణా చార్జీలు, ఎఫ్‌సీఐ బియ్యం అన్ని కేంద్రమే ఇస్తుందని తెలిపారు. ప్రపంచానికే సీడ్ అందించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. భవిష్యత్ బాయిల్డ్ రైస్ వినియోగం ఉండదని ఆ రోజే చెప్పామని గుర్తు చేశారు. దేశంలో కోటి ఎకరాల మాగాణి ఉందని చెప్పిన సీఎం కేసీఆర్.. కోటి టన్నులు అమ్మగలిగే మార్కెట్ శక్తి లేదా చెప్పాలన్నారు.

 వందల కోట్ల వ్యయం

వందల కోట్ల వ్యయం

హుజురాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి.. మద్యం ఏరులై పారించి అన్నింటికీ జీవోలు ఇచ్చి వేల కోట్లు ఖర్చు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అహంకారం బొంద పెట్టిన రోజే తెలంగాణలో అసలైన దీపావళి జరిగిందన్నారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వాటా ఫసల్ భీమా కట్టక రైతు రాక్షసిగా మారినప్పుడు ఆ నిధులు వాపసు పంపించినవు అన్నారు. ప్రభుత్వ పరమైన పని అంటే జనాలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

 మాటలే..

మాటలే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది అని ఈటల రాజేందర్ అంతకుముందు ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి అని పేర్కొన్నారు. అన్నీ అబద్దపు మాటలు అని విమర్శించారు.

Recommended Video

    Farm Laws Repeal : Pawan Kalyan మంచి ముగింపు.. పోరాటం విలువ | PM Modi || Oneindia Telugu
     హర్షం.. కానీ

    హర్షం.. కానీ

    వివాదాస్పద 3 రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. దీంతో అన్నీ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా స్వాగతిస్తున్నారు. కానీ విపక్షాలు మాత్రం.. రైతుల చావుల సంగతి ఏంటీ అని అడుగుతున్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+