ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మృతి.. ఇంట్లోనే విగతజీవిగా..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మృతి చెందారు. షన్ డిజైనింగ్ రంగంలో సత్తా చాటుతున్న ప్రత్యూష గరిమెళ్ల తన ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
కార్బన్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంటిలోని బాత్ రూమ్‌లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మరోవైపు మహిళా సెలబ్రిటీలకు డిజైనింగ్‌లో ప్రత్యూష సిద్ధహస్తురాలు. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష కూడా ఒకరని సమాచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు పలువురు క్రీడాకారులకు కూడా ఆమె డిజైనింగ్ చేశారని తెలుస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాంచరణ్ భార్య ఉపాసన భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ప్రత్యూషను ఉపాసన తన డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ పేర్కొన్నారు. ప్రత్యూష చాలా త్వరగానే వెళ్లిపోయిందని, ప్రత్యూష మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ పోస్ట్‌లో ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష గరిమెళ్ల ప్రతి విషయంలోనూ ఉన్నతంగానే ఉండేవారని..కెరీర్ పరంగా, కుటుంబం, స్నేహితుల పరంగానూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేదని ఉపాసన పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications