Hyderabad: హోటళ్లు, రెస్టారెంట్లులో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు..
హైదరాబాద్ లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తినాలంటే భయపడిపోతున్నారు జనాలు. చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో సరైన శుభ్రత పాటించడం లేదు. అలాగే ఆహార పదార్థాలు క్వాలిటీవి ఉపయోగించడం లేదు. పలు చోట్ల నిన్నని ఆహారాన్ని వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. చాలా చోట్ల అపరిశుభ్రతను గుర్తిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం జూన్ 29న హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, బాలానగర్ లోని హోటళ్లలో దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో పలు హోటల్లు రూల్స్ ఉల్లంఘించిట్లు గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండటం..కిటీకీలకు తెరలు ఏర్పాటు చేయకుండా దుమ్ము, ధూళి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాడై పోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో వై జంక్షన్‌లో ఉన్న జంపనాస్ వారాహి హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అవసరమైన ఉష్ణోగ్రత ప్రకారం చికెన్ ను నిల్వ చేయకుండా వాడుతున్నారని గుర్తించారు.

అంతేకాకుండా తలపాగా, గ్లౌజులు, అప్రాన్‌లు ధరించకుండా వంట చేస్తున్నట్లు కనుగొన్నారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా అందుబాటులో లేనట్లు చెప్పారు వివరించారు. కూకట్‌పల్లిలోని శ్రీ రాఘవేంద్ర భవన్‌లో కూడా వంటగది ప్రాంతంలో నీరు నిలిచి, అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ హ్యాండ్లర్‌లలో కొందరు తలపాగా, చేతి గ్లౌజులు.. అప్రాన్‌లు ధరించకుండా వంట చేస్తున్నారని గుర్తించారు.
హైదరాబాద్‌లోని బాలానగర్‌లోని శ్రీలక్ష్మి గ్రాండ్ ఉడిపి హోటల్‌పై అధికారులు దాడులు చేశారు. కుళ్లిపోయిన క్యారెట్లు, ప్యాక్ చేసిన పరాటా వాడుతున్నట్లు కనుగొన్నారు. ప్రైవేట్ హాస్టళ్లు, పీజీల్లో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications