సీఎంతో నలుగురు ఎమ్మెల్యేల భేటీ, మధ్యాహ్నాం మీడియా ముందుకు కేసీఆర్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సెగలు రేపుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. ప్రగతి భవన్‌లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. జరిగిన విషయం మరోసారి వివరిస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఎవరూ తమను అప్రోచ్ అయ్యారనే విషయం తెలిపారు.
తమను బెదిరించారని.. అందుకే కలిశామని కేసీఆర్‌తో ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మీడియా ముందుకు ఎమ్మెల్యేలతోపాటు కేసీఆర్ కూడా రానున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలు బ్రీఫింగ్‌తోపాటు.. కేసీఆర్ కూడా కీలక కామెంట్స్ చేస్తారని తెలిసింది. మునుగోడు బై పోల్ వేళ. క్యాంపెయిన్ హీటెక్కిస్తోండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇంతలో తెరపైకి కొనుగోలు అంశం వచ్చింది.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్‌లో కలిశారని ఫిర్యాదులో రోహిత్ వివరించారు. పార్టీ మారితే డబ్బుతోపాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని హాట్ కామెంట్స్ చేశారు. అరెస్టు చేసిన ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. వారి మొబైల్స్ పోలీసులు హ్యండొవర్ చేసుకున్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications