Free Bus: మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. మెట్రోలో తగ్గిన రద్దీ..
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, శనివారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణకు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు అందరూ రాష్ట్రవ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేసింది.
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రోల్లో రద్దీ తగ్గింది. శనివారం కాబట్టి సాధారణంగా రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక ఫ్రీ బస్ తో మెట్రోలో మహిళలు కనిపించడం లేదు. అటు హైదరాబాద్ లోని ఆటోవాలాలు కూడా ఉచిత బస్ తో తమకు దెబ్బేనని చెబుతున్నారు. తమ ఆటోల్లో ఎక్కువగా మహిళలు ప్రయాణిస్తారని.. ఉచిత బస్ తో వారంతా బస్ ఎక్కుతారని చెబుతున్నారు.

అయితే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో అమల్లో ఉంది. తాజాగా తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. అటు మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications