కొనసాగుతున్న నిమజ్జనం - బారులు తీరిన గణేష్ విగ్రహాలు..!!
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం రెండో రోజు కొనసాగుతోంది. తొలి రోజున భారీ వర్షం మధ్యనే నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన కార్య్రక్రమం తొలి రోజున ఆలస్యం కావటంతో..ఇప్పటికీ ట్యాంక్ బండ్ వద్ద భారీ సంఖ్యలో విగ్రహాలు బారులు తీరి ఉన్నాయి. అదే సమయంలో త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు నిర్వాహకులను కోరుతున్నారు. పాత సచివాలయం- ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తునారు. నక్లెస్ రోడ్డు..ఎన్టీఆర్ మార్గ్ మీద భారీ సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
మొదటి రోజున దాదాపు లక్ష విగ్రహాల వరకు నిమజ్జనం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాయని..భారీ వర్షం కారణంగానే ఆలస్యం అయిందని వివరించారు. ఇక, మరో వైపు నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుండగానే.... జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. రహదారులపై వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు. వినాయక సాగర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ సహా పలుచోట్ల గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

నిమజ్జనాల కోసం రహదారులపై గణనాథులు బారులు తీరాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నగరంలో తొలి రోజున నిమజ్జన శోభా యాత్ర దాదాపుగా 354 కిలో మీటర్ల మేర జరిగింది, మధ్నాహ్నం రెండు గంటలకే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని భావించినా.. సాయంత్రం 7 గంటల సమయంలో ఖైరతాబాద్ నిమజ్జనం పూర్తయింది. గతం కంటే భారీ సంఖ్యలో భక్తులు..నగర వాసులు నిమజ్జనం ప్రత్యక్షంగా తిలకించేందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఎంజే మార్కెట్ వద్ద చోటు చేసుకున్న ఘటన మినహా నగరంలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ముగ్గురు పోలీసు కమిషనర్లు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications