హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల పార్టీలోకి గట్టు రామచంద్రావు..? ముహూర్తం కుదిరింది.. చేరిక ఎప్పుడంటే..

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ టీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. అన్నీ పార్టీల నుంచి నేతలు క్యూ కడుతున్నారు. అయితే చోటా మోటా నేతల చేరికలు జరుగుతున్నాయి. కీలక నేత గట్టు రామచంద్రరావు కూడా వైఎస్ఆర్ టీపీలో చేరబోతున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు ప్రాధాన్యం లేదని ఇటీవల గట్టు రామచంద్రరావు రాజీనామా చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెంది రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌టీపీలో చేరబోతున్నారు.

gattu ramachandra rao will join sharmila party

గట్టు రామచంద్రరావు ఎమ్మెల్సీ బెర్త్ ఆశించి.. కలత చెంది.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని కేసీఆర్‌ను ఉద్దేశించి లేఖలో గట్టు రామచంద్రరావు తెలిపారు. ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు.

గట్టు రాజీనామాతో ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. గట్టు రామచంద్రరావుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. కానీ బెర్త్ మాత్రం దక్కలేదు. దీంతో పార్టీని వీడారు. ఇప్పుడు షర్మిల పార్టీలో చేరబోతున్నారు. దీంతో ఆ పార్టీ బలం మరింత పెరగనుంది.

English summary
senior leader gattu ramachandra rao will join sharmila party. he may join the party monday infront of sharmila
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X