లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
హైదరాబాద్: పెద్ద మొత్తంలో జీతాలు అందుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచం తీసుకోవడం మానేయడం లేదు. తాజాగా, మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) డిప్యూటీ కమిషనర్, ఓ కంప్యూటర్ ఆపరేటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
హైదరాబాద్‌కు చెందిన ఒమర్ అలీ ఖాన్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు సదరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జీహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 8 డిప్యూటీ కమిషనర్ రీచా గుప్తా ఆదేశాల మేరకు రూ. 2వేలు లంచం తీసుకున్నాడు ఆమె సహాయకుడు, కంప్యూటర్ ఆపరేటర్ సతీష్. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడ్ని పట్టుకున్నారు.

అనంతరం డిప్యూటీ కమిషనర్ రీచా గుప్తాతోపాటు సతీష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జీ ముందు నిందితులను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో రూ. 25 లక్షల విలువైన బంగారం సీజ్
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది గురువారం బంగారం అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని పట్టుకున్నారు. అతడ్నుంచి రూ.25 లక్షల విలువైన 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారం మేరకు ఆర్‌జిఐ విమానాశ్రయం నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించిన ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications