హైదరాబాదు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9490617111కు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌లో 84, సైబరాబాద్‌లో 38, రాచకొండ పరిధిలో 28, నగర పరిధిలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను బందోబస్తులో మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
గ్రేటర్‌లో పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...
Newest FirstOldest First
6:07 PM, 1 Dec
సాయంత్రం 6 గంటల సమయంలోగా క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం
6:07 PM, 1 Dec
ఈ నెల 4న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
6:07 PM, 1 Dec
ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్..ఈనెల 3వ తేదీన ఓల్డ్ మలక్ పేట్‌లో రీపోలింగ్
5:34 PM, 1 Dec
సాయంత్రం 4 గంటల సమయానికి 30శాతం పోలింగ్ నమోదు
5:33 PM, 1 Dec
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత
4:32 PM, 1 Dec
పోలింగ్‌కు గంటన్నర మాత్రమే సమయం ఉండగా ఇంకా పోలింగ్ బూతులకు పోటెత్తని ఓటర్లు
4:11 PM, 1 Dec
అమీర్‌పేట్‌లో 0.79 శాతం పోలింగ్..రెయిన్ బజార్‌లో అత్యల్పంగా 0.56శాతం పోలింగ్ నమోదు
4:10 PM, 1 Dec
పటాన్‌చెరులో 51.7శాతం పోలింగ్ నమోదు కాగా గుడిమల్కాపూర్లో 49.19శాతం నమోదైంది
3:56 PM, 1 Dec
మధ్యాహ్నం 3 గంటల సమయానికి కేవలం 25శాతం మాత్రమే నమోదైన పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
2:30 PM, 1 Dec
జీహెచ్ఎంసీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్. మధ్యాహ్నం 2:30 గంటల సమయం అవుతున్నప్పటికీ ఇంటి నుంచ బయటకు అడుగుపెట్టని ఓటర్లు
1:12 PM, 1 Dec
మందకొడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు
12:48 PM, 1 Dec
హైదరాబాదులో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో ఆనంద్ దేవరకొండ
12:46 PM, 1 Dec
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ దేవరకొండ
12:26 PM, 1 Dec
ఓల్డ్ మలక్ పేట్‌లో పోలింగ్ రద్దు.. తిరిగి 3వ తేదీన రీపోలింగ్. గుర్తులు తారుమారవడంతో పోలింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం
12:24 PM, 1 Dec
తార్నాక డివిజన్‌లో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ..ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
11:41 AM, 1 Dec
బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత
11:32 AM, 1 Dec
జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్..ఉదయం 11 గంటలకు 8.90శాతం పోలింగ్ నమోదు
11:26 AM, 1 Dec
ఆర్కేపురంలో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ
11:13 AM, 1 Dec
ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి
10:45 AM, 1 Dec
మలక్ పెట్ లో సింబల్ మార్పు పై జిహెచ్ యంసి కమిషనర్ ను నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం, నివేదిక తర్వాత అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం
10:45 AM, 1 Dec
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు, ఎదురుగా సీపీఎం అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి ఉంది. ఈవిషయమై ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
10:27 AM, 1 Dec
వెస్ట్ మారేడ్ పల్లి లోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.
9:58 AM, 1 Dec
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం
9:46 AM, 1 Dec
ఓటు హక్కు వినియోగించుకున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు
9:46 AM, 1 Dec
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో నిల్చున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే శాంతిభద్రతల పరిరక్షణలో దిగిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. వినాయక్ నగర్ వార్డ్ నంబర్ 140లో బందోబస్తును పర్యవేక్షించారు.
9:42 AM, 1 Dec
మరో పోలింగ్ బూత్ లో ఓటు ఉండే అవకాశం ఉందని ..పోలింగ్ బూత్ అధికారులు చెప్పినప్పటికీ.. తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో అడిగినా లేదంటుంన్నారని నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు..
9:41 AM, 1 Dec
ఓటర్ స్లిప్ లు వచ్చినప్పటికీ.. ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు
9:36 AM, 1 Dec
తెలంగాణ
జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్) శిఖా గోయెల్.
9:35 AM, 1 Dec
ఆన్ లైన్ ఓటర్ లిస్ట్ లో ఓటు ఉన్నప్పటికీ... పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ లో డిలీట్ చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓటర్లు..
READ MORE
9:34 AM, 27 Nov
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా వేడెక్కుతున్న ప్రచారం. నేడు హైదరాబాద్‌కు యోగీ ఆదిత్యనాథ్
9:34 AM, 27 Nov
గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ - బీజేపీ-మజ్లిస్ పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు
9:42 AM, 27 Nov
బండి సంజయ్ కామెంట్స్
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం
9:44 AM, 27 Nov
బండి సంజయ్ కామెంట్స్
శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి కొన్ని సంఘవిద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని సీఎం డి జి పి లు అంటున్నారు.
9:46 AM, 27 Nov
ఎన్నికల సిత్రాలు
ప్రచారంలో భాగంగా ఓ చోట ఆగి పానీపూరీ తింటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
9:49 AM, 27 Nov
గాంధీనగర్ డివిజన్
పానీ పూరీ బండి నిర్వహకుడు స్వామితో ముచ్చటించిన ఎమ్మెల్సీ కవిత పానీ పూరీ తిన్నారు.తాను తన చిన్నప్పుడు సికింద్రాబాద్‌లో పానిపూరి తిన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు
9:59 AM, 27 Nov
కిషన్ రెడ్డి కామెంట్స్
We've all details on Rohingyas. There's a colony of Rohingyas also. Police do regular monitoring. At some places their names added to voter's list. In this case, few police officers were suspended. Some Pakistanis with expired passports also here: MoS Home G.K. Reddy in Hyd y'day pic.twitter.com/9t751Igbll
హైదరాబాదులో రోహింగ్యాలు ఉన్నారు. వారున్నట్లు సమాచారం కూడా ఉంది. కాలనీలు కూడా ఉన్నాయి. పోలీసులు అక్కడ నిత్యం పర్యవేక్షిస్తుంటారు. కొందరైతే ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ పాస్‌పోర్ట్ ఎక్స్పైరీ అయిన పాకిస్తాన్ దేశీయులు కూడా ఉన్నారు: కిషన్ రెడ్డి
10:49 AM, 27 Nov
స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రచారానికి బీజేపీ నాయకులు జాతీయ స్థాయి నాయకులను పంపుతున్నారు. ఇక ట్రంప్ కూడా వచ్చి ప్రచారం చేస్తారేమో: కేటీఆర్ ఎద్దేవా
11:21 AM, 27 Nov
తెలంగాణ నుంచి పన్నుల ద్వారా వచ్చిన డబ్బులను ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు: ఎంపీ నామా నాగేశ్వరరావు
11:21 AM, 27 Nov
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలు చెబుతాం: నామా నాగేశ్వరరావు
11:22 AM, 27 Nov
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల ద్వారా పన్నుల రూపంలో రూ.3వేల కోట్లు కేంద్రానికి వెళుతున్నాయి: ఎంపీ నామా నాగేశ్వరరావు
11:22 AM, 27 Nov
కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా
11:22 AM, 27 Nov
వరదల సమయంలో ఒక్క బీజేపీ నేత హైదరాబాదుకు రాలేదు.ఇప్పుడు ఎన్నికలు కనుక పరుగులు తీసుకుంటూ వస్తున్నారు: ఎంపీ నామా
11:23 AM, 27 Nov
బీజేపీ నేతలు అబద్దాలు, మోసపు మాటలు మాట్లాడుతున్నారు: ఎంపీ నామా నాగేశ్వరరావు
11:24 AM, 27 Nov
రూ.3వేల కోట్లలో కేవలం 30శాతం మాత్రమే తెలంగాణకు ఇస్తున్నారు. మిగతా డబ్బులు ఎక్కడికెళుతున్నాయి:ఎంపీ నామా
11:24 AM, 27 Nov
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కేంద్ర మంత్రులంతా హైదరాబాదుకు వస్తున్నారు: ఎంపీ నామా
11:25 AM, 27 Nov
ఆరేళ్లలో రాష్ట్రానికి, హైదరాబాదుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి: ఎంపీ నామా
11:33 AM, 27 Nov
బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీలో దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య ఎన్నికలు: బండి సంజయ్
11:46 AM, 27 Nov
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్మగూడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్.
1:03 PM, 27 Nov
కూకట్ పల్లి
కూకట్ పల్లిలో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
1:04 PM, 27 Nov
అంబర్ పేట్
అంబర్పేట్ ప్రజలకు ఎంత చేసినా తక్కువే.నేను రుణపడి ఉన్నాను: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
1:28 PM, 27 Nov
శనివారం నాడు LB స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, MLC కర్నే ప్రభాకర్, TSIDC చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
3:58 PM, 27 Nov
బషప్పులు, పాస్టర్లు, చర్చి పెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం. అసాంఘీక శక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్
3:59 PM, 27 Nov
బీజేపీ మేనిఫెస్టోలో జీహెచ్ఎంసీకి సంబంధించిన అంశాలు ఎక్కడున్నాయ్: మంత్రి తలసాని శ్రీనివాస్
5:36 PM, 27 Nov
గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్. పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా
6:39 PM, 27 Nov
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
7:12 PM, 27 Nov
డబ్బులు ఖర్చు చేయడమే అభివృద్ధి కాదని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
8:35 PM, 27 Nov
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
9:22 PM, 27 Nov
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నుంచి నాగోలు వరకు నిర్వహించిన రోడ్ షోలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోందన్నారు.
9:22 PM, 27 Nov
రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చి కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.