భాగ్యనగర్ ప్రజలకు యూపీ సీఎం యోగి థాంక్స్.. గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు సాధించిన కమలం..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 48 డివిజన్లు గెలుచుకొని అధికార టీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే బీజేపీ అనుకూల పవనాలు వీచినా.. 20 నుంచి 30 డివిజన్లు గెలుచుకుంటుందని భావించారు. కానీ అనూహ్యంగా హాఫ్ సెంచరీకి దగ్గరగా నిలిచింది. దీంతో కమలదళ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అయితే బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కడంపై ఆ పార్టీ శ్రేణులతోపాటు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. బీజేపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచిన భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని ప్రకటించారు. ఈ కామెంట్ అప్పట్లో సంచలనంగా మారింది. అయినా గ్రేటర్ వయోజనులు కమలదళం వైపు మొగ్గుచూపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసించింది. ఇటీవల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆరు నెలల్లో సాగర్ ఉప ఎన్నిక కూడా ఉండనుంది.
Recommended Video
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications