జిహెచ్ఎంసి మరో విశిష్ట కార్యక్రమం.!యువత కోసం క్రీడా ప్రాంగణాలు,స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం.!
హైదరాబాద్ : నగర యువతీ యువకుల కోసం నగర పాలక సంస్థ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విశ్వనగరంలో రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మౌళిక సదుపాయాల కల్పనతో పాటు యువత మనోవికాసానికి దోహదం చేసే క్రీడా ప్రాంగణాలు, ఈత కొలనులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. నగర యువత శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలతో పాటు ఈత కొలనులు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నగరపాలక అధికారులు చెప్పుకొస్తున్నారు.
నగర యువత అవసరాల మేరకు, మారుతున్న జెనరేషన్లను మౌళిక వసతులను కల్పించాలని నగరపాలక సంస్థ కార్యారరణ రూపొందించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నగర యువత శారీరక సామర్థ్యం నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం, సాంప్రదాయక ఆటలతో పాటుగా ఆధునిక క్రీడలలో ప్రావీణ్యం పొందేందుకు స్థానిక క్రీడాకారులకు అనువుగా ఉండే విధంగా క్రీడా మైదానాలను నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

దానికి తోడు పెద్దలకు పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్ దోహదం చేస్తాయని భావించి అందుకు తగ్గట్టు జిహెచ్ఎంసి ఎంతో కృషి చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అవసరమైన చోట క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియంలు, ఇండోర్ స్టేడియంలు, ప్లే-గ్రౌండ్స్ నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. క్రీడా మైదానాలలో క్రీడాకారులకు ప్రయోజనాలు, ప్రజలకు వినోదభరిత కార్యక్రమాలు అందివ్వడంతో పాటు, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

Recommended Video
ఈ నేపథ్యంలో నగరంలో 86.61 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19 స్పోర్ట్ కాంప్లెక్స్ సంబంధిత సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాలను చేపట్టారు. అందులో 22.11 కోట్ల రూపాయల విలువైన 7పనులు పూర్తి చేశారు. మిగతా పనులు తుది దశలలో ఉన్నట్టు, ఆ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications