హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలన్నర రోజులే గడువు.. అయినా ఐ ఫోన్ 12 ఫ్రో కావాల్సిందే.. స్టాండింగ్ కమిటీ సభ్యుల పట్టు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో విచిత్రాలు జరుగుతున్నాయి. సభ్యులు వింత కోరికలు కోరుతున్నారు. కమిటీ కాల పరమితి మరికొద్దీరోజుల్లో ముగుస్తోందనగా కూడా.. గోంతెమ్మ కోరికలు కోరుతున్నారు. తమకు ఐ ఫోన్ కావాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం అంచనా కూడా వేశారు. అయితే ఏలినవారు కోరినా ఫోన్లు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది.

మరొకొద్ది రోజుల్లో గ్రేటర్ పాలక మండలి గడువు ముగియబోతుంది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యులు మాత్రం పదవీకాలం ముగిసేలోపు తమ కోరికలను తీర్చుకుంటున్నారు. తమకు ఐ ఫోన్లు కావాలంటూ పట్టుబట్టారు. అదీ కూడా ఐఫోన్ 12 ప్రొ, 512 జీబీ సామర్థ్యం ఉన్న ఫోన్ కావాలని అడిగారు. ఏలినవారి చేతిలో పని కాబట్టి ప్రతిపాదనలు కూడా సిద్దం చేశారు.

ghmc standing committee members want i phones..

ఐ ఫోన్లు కొనడానికి 27లక్షల 23వేల 740 రూపాయలు ఖర్చు అవుతోందని అంచనా కూడా వేశారు. అయితే మార్కెట్‌లో ఫోన్లు స్టాక్ లేవు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియను బల్దియా వాయిదావేసింది. లేదంటే విలువైన ప్రజాధనం మంచినీరులా కరిగిపోయేది. పాలకవర్గం సమయం నెలన్నర రోజులు ఉన్న కానీ.. ఖరీదైన ఫోన్ల కోసం పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశం చర్చకు దారితీసింది.

గ్రేటర్‌లో ప్రజల కష్టాలు పట్టించుకోరు కానీ.. కార్యాలయాలు, కార్ల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇక ఇక్కడ ఫోన్ల కోసం పట్టుబట్టడం చర్చకు దారితీసింది. అదీ కూడా లక్ష రూపాయలకు పైగా ఫోన్ కోసం కోరడం వివాదానికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. మరీ దీనిని పాలకవర్గం ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలీ మరీ.

English summary
ghmc standing committee members want i phone 12 pro. but committee period is one and half month only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X