హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులే కాదు.. రైతులకు అవమానం.. గోయల్ సారీ చెప్పు: హరీశ్ రావు డిమాండ్

|
Google Oneindia TeluguNews

యాసంగి పంట కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి అగ్గిరాజేశారు. ధాన్యం సేకరణలో తెలుగు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటర్ అటాక్ చేశారు. పీయూష్ గోయల్ తెలంగాణ రాష్ట్ర రైతులను అవమాన పరిచారని హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు రా రైస్ అడిగితే నూకలు తినడం అలవాటు చేసుకోవాలని మాట్లాడటం ఏంటీ అని ఫైర్ అయ్యారు.

 గోయల్.. సారీ చెప్పు..

గోయల్.. సారీ చెప్పు..


తెలంగాణ ప్రజలను అవమానానికి గురిచేసిన పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంత్రులను కాక తెలంగాణ రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో మరోసారి రైతులను కించపరిచేలా మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని గుర్తుచేశారు. దేశంలో సీడ్ 80 శాతం తయారు చేస్తాం, ఇతర రాష్ట్రాల్లో ఇది సాధ్యమా? అని అడిగారు. రబీలో వచ్చేవే బాయిల్డ్ రైస్ అని.. పంటల సాగును ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు. పంజాబ్‌కు తెలంగాణకు లింకు పెడతారా? అని ప్రశ్నించారు.

 పట్టించుకోని కేంద్రం..

పట్టించుకోని కేంద్రం..


రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధ్యత యుతమైన పదవీలో ఉండి పీయూష్ గోయల్ ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం తగదని సూచించారు. పీయూష్ గోయల్ అబద్దాలు మాట్లాడుతున్నారని, ప్రశ్నించినవారిపై ఐటీ, సీబీఐ దాడులు అని భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీ సంస్కృతి అని విమర్శించారు.

700 మంది చనిపోయేవారు కదా..?

700 మంది చనిపోయేవారు కదా..?


రైతు చట్టాలను ముందే వెనక్కు తీసుకుంటే 700 మంది రైతులు మరణించే వారు కాదా అని అన్నారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణను అవమాన పరిచారని కామెంట్ చేశారు. 11 లక్షల కోట్లు బడా పారిశ్రామిక వేత్తల రుణాలు రద్దు చేయడంతో బీజేపీ ప్రభుత్వం ఎవరి పక్షమో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ల పై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. పైగా రైతులను అవమానపరిచేలా కామెంట్ చేయడం సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సమయం చూసి బుద్ది చెబుతారని తెలిపారు.

English summary
central minister piyush goel say sorry to telangana people telangana minister harish rao demanded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X