అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించిన గవర్నర్, నివేదిక ఇవ్వాలని ఆదేశం

కల్వకుంట్ల కవిత వర్సెస్ ధర్మపురి అర్వింద్ మధ్య డైలాగ్ వార్ పీక్‌కు చేరింది. కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్‌లో ఉందని అర్వింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కవిత ఘాటుగా రిప్లై ఇచ్చారు. చెప్పుతో కొడతా అని మండిపడ్డారు. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు అర్వింద్ ఇంటి వద్ద రచ్చ రచ్చ చేశారు.

 ఖండించిన గవర్నర్

ఖండించిన గవర్నర్

అర్వింద్ నివాసంపై దాడిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది.

 అర్వింద్ కామెంట్స్

అర్వింద్ కామెంట్స్

కల్వకుంట్ల కవితను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలు వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ లోని అర్వింద్ ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అర్వింద్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

8 మంది గుర్తింపు

8 మంది గుర్తింపు

ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ నేతలు రాజా‌రామ్ యాదవ్, మన్నే గోవర్దన్ రెడ్డి, టీఆర్ఎస్‌వీ నేత స్వామి తదితరులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టిఆర్ఎస్ జండాలతో కర్రలతో రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పారు. బెంజ్ కార్ అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+