హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మ.. మా మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోంది.. గవర్నర్‌తో ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ మహిళా ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆమె పాండిచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మహిళలతో ఆప్యాయతతో పలుకరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బాధ్యతలు నిర్వహించడం వల్ల ఈసారి మీతో కలిసి సంషాన్ని పంచుకోలేక పోతున్నానని అన్నారు.

పలువురు మహిళలు తమిళిసైను అమ్మగా సంబోధించారు. తమ మధ్య లేకపోవడం వల్ల మాకు ఎంతో బాధగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. బిజీగా ఉన్నా మీ క్షేమాన్ని మర్చిపోనని గవర్నర్‌వారికి హామీ ఇచ్చారు. కొత్త బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్‌కు పలువురు మహిళా ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. టాప్‌-20 గ్లోబల్‌ వుమెన్‌ ఎక్స్‌లెన్స్‌-2021 అవార్డు వచ్చినందుకు వారు ససంతోషం వ్యక్తం చేశారు.

governor tamilisai soundararajan interacts women employees

మహిళా ఉద్యోగులనుపేరుపేరుగా పిలిచి వారితో మాట్లాడారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారికి తన కార్యదర్శి ద్వారా స్వీట్‌బాక్స్‌, జూట్‌బ్యాగులను అందజేశారు. కేవలం మహిళా అధికారులే కాదు, పారిశుధ్య పనివాళ్లు, గార్డెనింగ్‌ చేసేవారు, వ్యక్తిగత ఉద్యోగులు ప్రతి ఒక్కరితో గవర్నర్‌ మాట్లాడారు.

English summary
governor tamilisai soundararajan interacts women employees for the occasion of womens day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X