తెలంగాణ సర్కారు ఆలస్యంగా మేల్కొంది: మెడికల్ కాలేజీల అంశంపై గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తనదైన శైలిలో చురకలంటించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తనదైన శైలిలో చురకలంటించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణకు ఎన్నిక కాలేజీలు ఇచ్చారంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) కింద కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు.

అయితే, ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు గవర్నర్ తమిళిసై. ఇదే క్రమంలో ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు తమిళనాడుకు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని.. ఆ తర్వాత ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ రావడం వెనుకా ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ఉందని గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Governor Tamilisai Soundararajan on telangana medical colleges issue

కాగా, గవర్నర్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తమిళిసై ట్వీట్ పై రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గవర్నర్ ట్వీట్లను రీపోస్టు చేసిన సతీష్ రె్డ్డి.. గవర్నర్ ను ట్విట్టర్ యూనివర్సిటీ ఛాన్సలర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపుపై గవర్నర్ వ్యాఖ్యలు కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. అంతేగాక, గవర్నర్ వంటి అత్యున్నత స్థానంలో కొనసాగే అర్హత తమిళిసైకి లేదంటూ సతీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మీరు గవర్నర్ గా కాదు.. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+