కేసీఆర్ సర్కార్‌పై తమిళి సై గుర్రు.. కరోనా నియంత్రణ చర్యలపై అసంతృప్తి..
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. తాను స్వయంగా లేఖలు రాసినా.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదని గవర్నర్ మండిపడ్డారు. వైరస్ ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని మండిపడ్డారు. అధిక సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని సూచించారు. మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరానని తమిళిసై గుర్తుచేశారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించ లేదని మండిపడ్డారు.

ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటుందని తమిళిసై తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని గుర్తుచేశారు. కరోనా వైరస్ చికిత్స ప్రభుత్వానికి భారంగా మారిందని వివరించారు. కానీ పైకి మాత్రం అన్నీ వసతులు సమకూర్చామని చెబుతోందన్నారు.
కానీ వాస్తవం మరోలా ఉందని... రోగులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో అర్థమవుతోందన్నారు. తనతో సీఎం కేసీఆర్ సమావేశమైన సందర్భంలో చెప్పానని.. కానీ ఆయన వినిపించుకోలేదని ధ్వజమెత్తారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications