Tamilisai Soundararajan: ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై.. అమిత్ షాతో భేటీ..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. తమిళిసై సాయంత్ర 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. అయితే ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన నేపథ్యంలో.. ఈ రోజు గవర్నర్ అమిత్ షాను కలవడం ప్రధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నిక, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈనెల 12 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర అధికారులకు ఇప్పటికే సమాచాకం అందింది. దీంతో ప్రధాని పర్యటనకు రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ప్రధానమ మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది తెలియరాలేదు. కాగా రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభించిన అనంతరం మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Governor Tamilisai will meet Union Home Minister Amit Shah in Delhi this evening

తమిళి సై, అమిత్ షా సమావేశంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శాలు చేస్తోంది. బీజేపీ వారే ఎమ్మెల్యే కొనుగోలు యత్నంచినట్లు ఆరోపిస్తుంది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. టీఆర్ఎస్ విమర్శాలను బీజేపీ గట్టిగానే తిప్పికొడుతుంది. టీఆర్ఎస్ మరో నాటకానికి తెర తీసిందని ఆరోపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+