Alai Balai: అక్టోబర్ 13న అలయ్ బలయ్.. అతిథులకు దత్తాత్రేయ ఆహ్వానం..
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 13న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అలయ్ బలయ్ కి కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరిని ఆహ్వానిస్తారు.
అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులో ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులను దత్తాత్రేయ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి అలయ్ బలయ్ కి రావాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆహ్వానించారు. దత్తాత్రేయ ఇప్పటికే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఆహ్వాన పత్రికను కూడా అందజేశారు.

ఇంకా చాలా మంది ప్రముఖలను ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమంతో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరు ఒకే వేదికపైకి వస్తారు. కాగా ఈ అలయ్ బలయ్ లో అన్న రకాల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వంటలు వడ్డిస్తారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దీనికి మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, అప్పటి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆచార్య కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈసారి స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications