Heat Islands: నగరంలో హీట్ ఐలాండ్స్.. ఎక్కడంటే..!
ఎండకాలం ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఈ సమ్మర్ మాత్రం మరింత మండిపోతోంది. సాధారణంగా తెలంగాణలో ఉత్తర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎప్పుడైన ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి.
ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రంగా ఉంటుంది. తాజాగా నగరంలో హీట్ ఐలాండ్స్ గుర్తించారు. హైదరాబాద్ ఆర్బన్ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. వేడి తీవ్రత అంచనా వేస్తూ హీట్ ఐలాండ్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు మేఘన, శబరినాథ్ తెలిపారు. మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా హీట్ ఐలాండ్స్ ను గుర్తించారు.

నగరంలో పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్ దేవ్ పల్లి, బీఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ హీట్ ఐలాండ్స్ గా గుర్తించారు. ల్యాండ్ శాటిలైట్ వివరాల ఆధారంగా ఉష్ణోగ్రతలను లెక్కి గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు. హీట్ ఐలాండ్స్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే వేడి ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
నగరంలో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే భూ ఉపరితలంపై రెండు, మీటర్ల ఎత్తులో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు సంస్థ పరిశోధనలో గుర్తించింది. చెట్లు నరికివేయడం, కాంక్రిట్ నిర్మాణాలు, వేడిని శోషించే వస్తువుల వల్ల ఇలా జరుగుతోందని సంస్థ పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications