ఉస్మానియాలో ఘోరంగా పరిస్థితులు.. ముంచెత్తిన మురుగు నీరు.. కేసీఆర్ పై మర్డర్ కేసన్న బీజేపీ

హైదరాబాద్ సిటీలో బుధవారం భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రిని మురుగునీరు ముంచెత్తింది. కరోనా వేళ బిక్కుబిక్కుమంటోన్న రోగులు.. వార్డులను మురుగునీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లాలో తెలీక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

కరోనా బాధిత పేషెంట్లున్న వార్డుల్లోకి కూడా మోకాలి లోతులో డ్రైనేజీ నీరు ప్రవహించింది. ఆ ప్రవాహంలో వైద్య సిబ్బందికి కేటాయించిన పీపీఈ కిట్లు కొట్టుకుపోయాయి. అక్కడి బెడ్లు, ఇతర సామ్రాగ్రి అంతా తడిసిముద్దయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రి భవంతి వందేళ్ల నాటిది కావడంతో పైనుంచి పెచ్చులు కూడా ఉడిపడటంతో రోగులు హాహాకారాలు చేశారు. వర్షునీళ్లు, డ్రైనేజీ నీళ్లు కలిసి పారడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా దుర్వాసన వ్యాపించింది.

heavy rain in Hyderabad: Osmania Hospital flooded, pathetic videos gone viral

న్యూ బ్లాక్, ఓల్డ్ బ్లాక్ మధ్య ఉన్న దారిలో డ్రైనేజీ లీక్ కావడంతో వైద్యులు, రోగులు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. మంగళవారం కూడా ఇదే తరహాలో కొన్ని వార్డుల్లోకి నీరు చేరడం, అక్కడ రోగులు ఉండే పరిస్థితి లేకపోవడంతో వారిని వేరే వార్డులకు తరలించే ప్రయత్నం చేశారు. అంతలోనే బుధవారం నాటి వర్షానికి పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది.

heavy rain in Hyderabad: Osmania Hospital flooded, pathetic videos gone viral

ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగునీరు చేరిన దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ''కరోనా విలయతాండవంచేస్తోన్న వేళ.. ఓ వైపు రూ.500 కోట్లతో కొత్త సచివాలయం పనులు.. మరోవైపు పేదలకు దిక్కైన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇదీ దుస్థితి..'' అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియాలో దుస్థితిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

''ఉస్మానియా ఆస్పత్రి గురించి ఎవరికేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని డ్యూటీలు చేయడానని నేను కళ్లారా చూశాను. ఇవాళ ఆస్పత్రి మొత్తం డ్రైనేజీ నీళ్లలో మునిగిపోయింది. జనం ఇంత దారుణంగా బాధపడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోడు. హెల్త్ మినిస్ట‌ర్ సహా రాష్ట్ర మంత్రులంతా రబ్బర్ స్టాంపులే. ఉస్మానియా ఆసుపత్రి కూలిపోతే ప్ర‌జ‌లే కేసీఆర్ పై మ‌ర్డ‌ర్ కేసు పెడ‌తారు'' అని రాజా సింగ్ మండిపడ్డారు.

heavy rain in Hyderabad: Osmania Hospital flooded, pathetic videos gone viral

చాలా ఏళ్ల కిందటే ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ సర్కారు.. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయడంలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుత కరోనా కాలంలోనైనా ఆస్పత్రుల్ని బాగు చేస్తారనుకుంటే, వ్యక్తిగత ప్రతిష్టకుపోయి సచివాలయాన్ని కూలగొడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కరోనా ఏర్పాట్లపై హైకోర్టు ఒకటికి రెండు సార్లు మొట్టికాయల వేయడంతో కరోనా ఆస్పత్రుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+