సిటీలో దంచికొట్టిన వాన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం పూట భారీ వాన పడటంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
పాతబస్తీ, మొఘల్‌పురా, సుల్తాన్‌షాహీ, బహదూర్‌పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

గత పది, పదిహేనురోజుల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు నిండుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ముసురు వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి.. రైతులు కూడా పనిచేసుకోలేని సిచుయేషన్ ఏర్పడింది. ఇప్పటికే నారు కొందరికీ నష్టం చేకూర్చగా.. మరికొందరు మళ్లీ కూడా వేశారు.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications