మెహఫిల్‌‌లో బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త

చికెన్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్‌లోనే తినాలని చాలామంది భావిస్తుంటారు. వరల్డ్ ఫేమస్ బిర్యానీ హైదరాబాద్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే అలాంటి హైదరాబాద్‌లో ఆహార భద్రత కరువైంది. ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హాటల్స్‌పై దాడులు చేశారు. ఆహార భద్రత నియమాలు పాటించని పలు హోటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయిన కొన్ని హోటల్స్ తమ పద్దతిని మార్చుకోవడం లేదు.

తాజాగా హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్ అయిన మెహఫిల్‌‌లో బిర్యానీ పురుగు దర్శనం ఇచ్చింది. ఈ విషయాన్ని కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తాజాగా స్విగ్గీ ద్వారా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని మెహఫిల్‌‌ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బిర్యానీలో చికెన్ ముక్కల్లో పురుగులు ఉన్నట్టు కస్టమర్ గుర్తించాడు.ఈ విషయాన్ని స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. క్షమాపణ చెప్పి రూ.64 రిఫండ్ చేసినట్లు తెలిపాడు.

Horrible at Hyderabad s Mehfil Restaurant Man gets worms in Chicken biryani

అయితే తాను ఆర్డర్ చేసిన బిర్యానీకి మాత్రం రూ.318 ఖర్చైందని.. కానీ కేవలం రూ .64 రూపాయిలు మాత్రమే తిరిగిచ్చారని కస్టమర్ వెల్లడించాడు. మెహ్‌ఫిల్‌ నుంచి ఎవరూ ఆహారం ఆర్డర్ చేయొద్దని నెటీజన్లకు సూచించాడు. స్విగ్గీని ట్యాగ్ చేయడమే కాకుండా రెస్టారెంట్ పై అసంతృప్తితో ఉన్న తేజ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేశాడు. 'మెహఫిల్ కూకట్ పల్లి నుంచి ఎటువంటి ఆర్డర్స్ చేయవద్దంటూ తన పోస్ట్‌లో అని రాసుకు రావడంతో పాటు, బిర్యానీలో వచ్చిన పురుగు, స్విగ్గీ టీంతో తాను చేసిన చాట్‌ను సైతం షేర్ చేశాడు.

Horrible at Hyderabad s Mehfil Restaurant Man gets worms in Chicken biryani

సోషల్ మీడియా పోస్ట్‌ను గమనించిన ఫుడ్ సేఫ్టీ బృందం రెస్టారెంట్‌ను తనిఖీ చేసి, కల్తీ చికెన్ బిర్యానీ మరియు లూజ్ పెరుగు నమూనాలను సీజ్ చేయడం జరిగింది. సరైన లేబుల్స్ లేని కారణంగా 25,000/- విలువైన ఆహార వస్తువులు మరియు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కస్టమర్‌కు తెలియజేస్తూ అతని ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. తాజా ఘటనతో మరోసారి హైదరాబాద్‌లో హోటల్స్‌లో ఆహార భద్రతపై కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+