TSPSC Paper Leak: ఏఈ పేపర్ లీక్ విషయం ఎలా బయటకొచ్చిదంటే..!
ఏఈ పేపర్ లీక్ విషయం ఎలా బయటకొచ్చిందనే దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేపర్ లీక్ విషయం ఎలా బయటకు వచ్చిందనేది మొదటి నుంచి వస్తున్న సందేహం. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ నెల 5న ఏఈ పరీక్ష తర్వాత నిందితులు వనపర్తిలో దావత్ చేసుకున్నారు. ఆ సమయంలోనే డబ్బుల విషయమై గొడవ జరిగి లీక్ విషయం బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
రేణుక, డాక్యా దంపతులు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ తీసుకున్న తర్వాత అతడికి డబ్బులిచ్చారు. ఆ తర్వాత రేణుక దంపతులు నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్, రాజేంద్ర నాయక్ తో బేరం మాట్లాడుకున్నారు. వారిని గండీడ్ మండలం పంచాంగల్ తండాకు తీసుకెళ్లారు. అక్కడే వారంతా ప్రిపేర్ అయ్యారు. మార్చిన 5న వారు సరూర్ నగర్ వచ్చి పరీక్ష రాశారు.

ఏఈ పరీక్ష అనంతరం రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి వెళ్లారు. అక్కడ వీరంతా కలిసి దావత్ చేసుకున్నారు. అక్కడికి రేణుక దంపతులు కూడా వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో రేణుక డబ్బులు ఇవ్వాలని నీలేశ్ ను అడిగినట్లు సమాచారం. ఒప్పంద ప్రకారం పరీక్షకు ముందు రూ.5 లక్షలు ఇవ్వాలి.. మిగతావి పరీక్ష తర్వాత ఇవ్వాలి. అయితే రేణుక తనకు ఇప్పుడే పూర్తి పైసలు ఇవ్వాలని వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేణుక.. నీలేశ్ ను బెదిరించింది. దీంతో నీలేశ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లీక్ విషయం బయటకొచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications