హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు.. అనుభవం పరిగణలోకి తీసుకోలే.. మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు లేకున్నా వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు అధికార పార్టీలోకి వలసలు ఉండేవి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లోకి కూడా ఉన్నాయి. అయితే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడారు. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నర్సింహులు.. ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించారు.

రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరానని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేకపోయారని వివరించారు. అందుకే తాను చాలా బాధపడుతున్నానని లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు. పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదన్నారు.

how etela rajender come to bjp:motkupally narshimlu

Recommended Video

Motkupalli Narasimhulu On KCR దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదు | Oneindia Telugu

అనుభవాన్ని పరిగణలోకి తీసుకోని అవకాశం కల్పించడంలో పార్టీ విఫలమైందన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక ఈటల రాజేందర్ పార్టీలోకి తీసుకునే సమయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదని. దళితుల భూములు ఆక్రమించిన ఈటల రాజేందర్ పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు.

ఈటల రాజేందర్ ఎస్సీల భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నందుకు కనీసం వివరణ కూడా తీసుకోకుండా పార్టీలో చేర్చకున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే తనను దూరం పెట్టడం బాధకరమన్నారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

English summary
senior leader motkupally narshimulu resigned bjp. how etela rajender come to bjp he asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X