ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. సమీపంలోని దుకాణాలు, ఆస్పత్రికి వ్యాపించే అవకాశం ఉండటంతో వాటిలోని ప్రజలు, రోగులను ఖాళీ చేయించారు.

Huge fire accident in RTC X Road in Hyderabad

ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకపోయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ దారుణ హత్య

హైదరాబాద్ నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణ హత్యకు గురయ్యారు. షాద్‌నగర్‌లోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. కిరాతకంగా కృష్ణను కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.

హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, ఫాంహస్ నిర్మాణాలు చేస్తూ కేకేగా గుర్తింపు పొందారు.

షాద్ నగర్ సమీపంలోని కమ్మదానంలో ఉన్న తన సొంత కేకే ఫాంహౌస్‌లో ఉండగానే.. నిందితులు రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన కృష్ణను చికిత్స కోసం శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కేకే ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+