శంషాబాద్‌లో దారుణం.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు : కొనఊపిరితో కొట్టుమిట్టాడు
శంషాబాద్ : క్షణికావేశం .. అతని ప్రాణాలమీదికి తీసుకొచ్చింది. చిన్న అంశంపై భార్యతో వాదన .. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంకేముంది ఒంటిపై కిరోసిన్ పోసుకొని .. తీవ్రగాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలోని పోలీసుస్టేషన్‌లో జరిగిన సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది.
పని కోసం గొడవ ..
వనపర్తి జిల్లా చెలిమిల్లకు చెందిన శ్రీనివాసులు పొట్టకూటి కోసం పట్నం వచ్చాడు. శంషాబాద్ పరిధిలోని ఎయిర్ పోర్టు కాలనీలో భార్యభర్తలు ఉంటున్నారు. ఇంతవరకు బానే ఉంది .. కానీ మూడురోజుల క్రితం పనికి వెళ్లే విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభమైన గొడవ వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోప్రోద్రిక్తుడైన శ్రీనివాసులు కిరిసోన్ తీశాడు. భార్యపై పోసి .. తనపై కూడా పోసుకున్నాడు. కలిసే ఉందాం .. చనిపోదామని అగ్గిపెట్టె కోసం వెతకడం మొదలెట్టాడు. ఇదే అదనుగా భావించిన భార్య బయటకు పరుగుతీసింది. అయితే ఆ సమయంలో తన భర్త గురించి ఆలోచించలేదు.

భార్య సేఫ్ ..
అప్పటికే ఆగ్రహంతో ఉన్న శ్రీనివాసులుకు అగ్గిపెట్టే దొరికింది. ఇంకేముంది తనకుతాను నిప్పంటించుకున్నాడు. బార్య మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. శ్రీనివాసులు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భార్యతో పని విషయంలో గొడవ ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం .. అతని జీవితాన్నే ఛిద్రం చేసింది.












Click it and Unblock the Notifications