అలర్ట్: 22 ఎంఎంటీఎస్ రైళ్లు నాలుగు రోజులపాటు రద్దు, ఎందుకంటే?
హైదరాబాద్: జంట నగరాలు హైదరాబాద్-సికింద్రాబాద్ మధ్య సేవలందించే పలు ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను నాలుగు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. నిర్వహణ పనుల కారణంగా జూన్ 14, 15 తేదీల్లో లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య పది రైళ్లను రద్దు చేసింది.
ఇక జూన్ 14 నుంచి 17 తేదీల్లో ఉందానగర్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, రామచంద్రపురం-ఫలక్‌నుమా రూట్లలో పలు రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రద్దయిన రైళ్ల వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మరోవైపు, అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం విశాఖపట్నం నుంచి 5.45 గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(20833) ఉదయం 8.45 గంటలకు బయల్దేరింది.
Cancellation of MMTS Trains @drmsecunderabad @drmhyb pic.twitter.com/DPamweZbAs
— South Central Railway (@SCRailwayIndia) June 14, 2023
ఈ క్రమంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు(20834) టైమింగ్స్ ను అధికారులు రీషెడ్యూల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రబాబాద్ రైల్వే స్టేషన్‌లో బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications