ఫ్లై ఓవర్ల సిటీగా హైదరాబాద్.!అందుబాటులోకి రానున్న మరో రెండుఫ్లైఓవర్లు.!మేయర్ నిర్మాణాల పరిశీలన.!
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకుంటున్నాయి. శరవేగంగా అభివృద్దివైపు దూసుకెళ్తున్న ఫైనాన్షియల్ జిల్లాలో మరో రెండు నూతన ఫ్లైఓవర్స్ నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్లను నగర మేయర్ పరిశీలించారు. సిగ్నల్ ఫ్రీ రహదారులుగా మరో రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయని మేయర్ గద్వాల విజయ లక్ష్మి అన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టులను షేక్ పేట్, ఓవైసీ ఫ్లై ఓవర్ పనులను మేయర్ పరిశీలించారు.

తుది దశలో షేక్ పేట్, ఓవైసీ ఫ్లై ఓవర్ లు.. నిర్మాణపనులను పరిశీలించిన మేయర్
పెరుగుతున్న నగరాభివృద్ధికి అనుగుణంగా వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సిగ్నల్ ఫ్రీ రహదారులను చేపట్టడం జరుగుతుందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. యస్.అర్.డి.పి కార్యక్రమం ద్వారా మహానగర అభివృద్దికి 8 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, అర్.ఓ.బి లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో 22 పనులను పూర్తి చేసినట్లు మిగిత 6 వేల కోట్లతో 25 పనులను వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మేయర్ తెలిపారు.

శేరిలింగంపల్లి ట్రాఫిక్ సమస్యలు లేని జోన్.. ప్రారంభానికి సిద్దమైన ఫ్లైఓవర్
అంతు కాకుండా మహా నగర అభివృద్దిలో లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు, జంక్షన్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్పొరేటర్ల ద్వారా శాసన సభ్యుల ద్వారా సిఫార్స్ చేయమని చెప్పినట్లు మేయర్ అన్నారు. షేక్ పేట్ ఫ్లై ఓవర్ 333.55కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో 2.71 కిలో మీటర్ల మేరకు చేపట్టినట్లు ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 18 నుండి శేరిలింగం పల్లి జోన్ మల్క చెరువు వరకు 6 లేన్లతో ఫ్లైఓవర్ ను నిర్మించారు. గతంలో 4 జంక్షన్లు ఉండగా దాంతో 4 లక్షల వాహనదారులు ఇబ్బంది పడే వారని బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సిగ్నల్ ఫ్రీగా ఉంటుందన్నారు మేయర్.

గచ్చిబౌలి నుండి కూకట్ పల్లి జెఎన్టీయూ వరకు.. 17 కి.మీ. సిగ్నల్ లేని ప్రయాణం
లక్డికాపూల్ నుండి మెహిదీపట్నం టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి వరకు 11 కిలోమీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్ లో మెరుగైన రవాణా సౌకర్యంతో పాటుగా రేతీబౌలీ నుండి ఓ.ఆర్.ఆర్ గచ్చిబౌలి వరకు ఫ్లై ఓవర్ కలుపుతుని, అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుండి ఎన్.జె.ఎన్.టి.యు జంక్షన్ కలుపుతూ 17 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా సాఫీగా కొనసాగుతుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేసారు.

నగరంతో పాటు చుట్టుపక్కల ట్రాఫిక్ ఫ్రీ సిటీ.. జీహెచ్ఎంసీ బృహత్కర కార్యక్రమం
ఓవైసీ ఫ్లై ఓవర్ వలన దక్షణ ప్రాంతం నుండి తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లవచ్చని, 63 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1.36 కిలో మీటర్ల మేరకు చేపట్టారని మేయర్ తెలిపారు. అరంఘడ్ నుండి ఎల్.బి నగర్ వరకు ట్రాఫిక్ ను మెరుగు పరుస్తుందని, మిధాని ఓవైసీ జంక్షన్ లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ అవుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్.అర్.డి.పి ప్రాజెక్టు సి.ఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, రవి కిరణ్, అశోక్ సమ్రాట్, యస్.అర్.డి.పి యస్.ఈ లు వెంకటరమణ, దత్తుపంతు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications