Constable Naveena: కానిస్టేబుల్ నవీనకు సీపీ అభినందనలు..
గురువారం జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కాపాడిన ఉమెన్ కానిస్టేబుల్ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి గురువారం జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల విక్రయించారు. దీంతో టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు భారీగా తరలి వచ్చారు.

దూసుకెళ్లారు
గేట్లు ఓపెన్ చేయ్యగానే అభిమానులు ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల వైపు దూసుకెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ లోపు తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్పృహ కోల్పోయింది. పోలీసులు ఆమెను వెంటనే పక్కకు తీసుకెళ్లారు.

నోటి ద్వారా రజితకు శ్వాస
కానీ ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నవీన.. తన నోటి ద్వారా రజితకు శ్వాస అందిస్తూ కాపాడే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నం కొంత ఫలించింది. దీంతో రజితను ఆస్పత్రికి తరలించారు.
ప్రశంసలు
నవీన చేసిన ప్రయత్నాన్ని అందరు ప్రశంసించారు. మానవత్వం చాటిన పోలీసు అంటూ సోషల్ మీడియాలో ఆమె ప్రశంసలు కురుపిస్తున్నారు. కాగా జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 20మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారందరు ఆస్పత్రి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications