హైదరాబాద్: సూట్ కేసులో మృతదేహం - సిటీలో కలకలం -అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే గతేడాది మాత్రం ఆన్ లైన్ నేరాలు పెరిగి, సాధారణ క్రైమ్ కేసులు తగ్గాయని పోలీసులు చెప్పారు. కొత్త ఏడాది తొలివారంలోనే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రధాన ముద్దాయిగా ఉన్న కిడ్నాప్ కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. తాజాగా సూట్ కేసులో శవం ఘటన కూడా సిటీలో కలకలం రేపింది..
Recommended Video

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తిని హత్య చేసి ఆ మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టారు ఇద్దరు దొంగలు. వేరే కేసులో పట్టుబడిన దొంగలను పోలీసులు విచారిస్తుండగా.. సూట్ కేసులో శవం విషం బయటపడింది. రాజేంద్రనగర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

తమతో పాటు చోరీలకు పాల్పడే రషీద్ అనే వ్యక్తితో గొడవ పడి తాము అతడిని హత్య చేసి సూట్‌కేసులో పెట్టామని నిందితులైన ఇద్దరు పోలీసులకు చెప్పారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, శవాన్ని కుక్కి ఉంచిన సూట్ కేసును ఎక్కడ పడేశామన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు...
సూట్ కేసులోని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూట్ కేసులోని మృతుడు రషీద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు..


Click it and Unblock the Notifications