హైదరాబాద్‌లోనే అగ్నివీరుల మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభం: 5వేల మందికిపైగా..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా గోల్కొండలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌లో అగ్నివీర్ మొదటి బ్యాచ్‌లో 300 మందికి ట్రైనింగ్ ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ సెంటర్లో 2265 మంది అగ్నీవీరులు చేరారు. సైన్యా నికి అదనపు బలం జోడించేలా.. తీసుకొచ్చిన అగ్నిపథ్‌కి ఆశిం చిన దానికంటే ఎక్కువ స్పం దనే లభించింది.
తొలుత విమర్శలు వెల్లువెల్లు త్తినాత్తి ఆ కార్యక్రమం వల్ల యువతకు లభించే అవకాశాలపై సైనిక అధికారులు, కేంద్రమంత్రులు కూలంకషంగా వివరించారు. ఆర్మీ అధికారుల పిలుపుతో యువత పెద్ద ఎత్తున అగ్నిపథ్ నియామక ర్యాలీలో పాల్గొం ది.

అర్హత సాధించినవారికి ప్రస్తుతం సైనిక కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోం ది.
డిసెంబర్ 25 నుంచి 31లోగా నిర్దేశింర్దేశించిన శిక్షణా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిం దిగా అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఈ మేరకు గోల్కొం డలోని ఆర్టిలర్టి రీ సెంటర్లో 2265మంది అగ్నివీరులు చేరారు. వారికి జనవరి 1నుంచి శిక్షణ మొదలైంది. దేశంలో పేరొందిన ఆర్మీ శిక్షణా కేంద్రాల్లో గోల్కొం డ ఆర్టిలర్టి రీ సెంటర్ ఒకటి.
దాదాపు 1900 ఎకరాల విస్తీర్ణంస్తీ ర్ణంలో ఉన్న ఈ శిక్షణా కేంద్రంలో అగ్నివీరులను.. అన్ని విభాగాల్లోనూ సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. 31 వారాలపాటు శిక్షణ కొనసాగనుంది. తొలి 10వారాలు బేసిక్ మిలటరీ ట్రైనింగ్ పేరిట శిక్షణనిస్తున్నారు. ఆ తర్వా త 21వారాలపాటు అడ్వా న్స్ మిలటరీ ట్రైనింగ్ పేరుతో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 31 వారాలపాటు ఆర్మీ అధికారులు వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
కాగా, ఫిబ్రవరిలో 2265 మందికి, ఆ తర్వాత 3300 మందికి ట్రైనింగ్ ప్రారంభించనున్నారు. ఇక్కడ్నుంచే 5500 మంది అగ్నివీర్‌లను సైన్యంలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 30కి పైగా ఫిజికల్ ట్రైనింగ్ గ్రౌండ్స్ సిద్ధం చేశారు. 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ఫైరింగ్ రేంజ్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇణ్ ఫ్యాట్రీ వెపన్ ట్రైనింగ్ సిమిలేటర్ ల్యాబ్ ద్వారా డిజిటల్ షూటింగ్ చేయిస్తున్నారు. పాయింట్స్ ప్రకారం ట్రైనింగ్ లో వెయిటేజ్ ఇస్తున్నారు.శారీరకంగా, మానసిక ష్తైర్యాన్ని నింపేలా తీర్చిదిద్దుతున్నారు.
అగ్నివీరులుగా శిక్షణపూర్తి చేసుకున్న తర్వా త సైన్యం లో.. నాలుగేళ్లపాళ్లటు సేవలందిస్తారు. ఆ తర్వా త అగ్నిపథ్లో నిర్దేశింర్దేశించిన విధంగా 25శాతం మందిని సైన్యా నికి ఎంపిక చేస్తారు. మిగతా
75శాతం మందికి అగ్నివీర్ సర్టిఫిర్టికెట్ అందించి ఇతర ఉద్యోగాల్లో కోటా పొందేలా సౌలభ్యం కల్పిస్తారు.ఆర్థిక సాయం కూడా అందిస్తారు.












Click it and Unblock the Notifications