Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ : గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్... 4 రోజులు గదిలో నిర్బంధించి...

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ మత్తు మందు ఇచ్చి గదిలో బంధించిన సిబ్బంది... వారిపై పలుమార్లు అత్యాచారం జరిపారు. బాధితుల్లో ఒకరైన యువతి అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాలుగు రోజుల పాటు తమను గదిలో బంధించారని.. ప్రస్తుతం తన అక్క ఆచూకీ తెలియట్లేదని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

బాధితురాలి కథనం ప్రకారం... మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతనికి సాయంగా ఉండేందుకు అతని భార్య, ఆమె చెల్లెలు వెంట వచ్చారు. అతన్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేశాక ఓ గదిలోకి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ గది ఎక్కడో తెలియక పేషెంట్ భార్య,ఆమె చెల్లెళ్లు తికమకపడ్డారు. వారి అయోమయాన్ని,గందరగోళాన్ని గమనించిన ల్యాబ్ టెక్నీషియన్ ఉమా మహేశ్వర్... తనతో వస్తే పేషెంట్‌ను షిఫ్ట్ చేసిన వార్డు చూపిస్తానని చెప్పాడు.దీంతో అతను మాటలు నమ్మి ఇద్దరు అక్కాచెల్లెళ్లు అతని వెంట వెళ్లారు.

hyderabad gandhi hospital staff allegedly gang rape on sisters

ఆ ల్యాబ్ టెక్నీషియన్ వారిని ఓ గదిలో నిర్బంధించి మత్తు మందు ఇచ్చాడు. ఆపై నలుగురు వ్యక్తులు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపారు. నాలుగు రోజుల పాటు వారిని నిర్బంధించారు.బాధితుల్లో ఒకరైన యువతి ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని బయటపడింది. మహబూబ్‌నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన సోదరి ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. అయితే గాంధీ ఆస్పత్రి పరిధిలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితురాలికి మహబూబ్‌నగర్ పోలీసులు చెప్పారు. దీంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్న యువతి... చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌,మరో ముగ్గురు తమపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉమా మహేశ్వర్‌తో పాటు ఆస్పత్రిలో పనిచేసే గార్డులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.గాంధీ ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు యువతులపై అత్యాచారం జరిగినా బయటకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు,బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+