ఆసుపత్రిలో రచ్చరచ్చ.. ఫర్నీచర్ ధ్వంసం.. అడ్డొచ్చిన పోలీసులపై దాడి
హైదరాబాద్ : డాక్టర్లు నిర్లక్ష్యంగా వహించారంటూ పేషెంట్ బంధువులు విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రిలో నానా హంగామా చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడమే గాకుండా అడ్డొచ్చిన పోలీసులపై దాడికి దిగారు. నానా బూతులు తిడుతూ నోటికి పనిచెప్పారు. మీకు ఇక్కడేం పనంటూ ఖాకీలపైకి రెచ్చిపోయారు. సీఐని నెట్టివేస్తూ అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశారు.
లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. పోలీసులను నెట్టివేస్తూ నానామాటలు తిడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. షమీమ్ బేగం అనే మహిళ గుండెనొప్పితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతిచెందారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే షమీమ్ బేగం చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలోని ఫర్నీచర్, కంప్యూటర్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై జులుం చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీయడమే గాకుండా చేయిచేసుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications