Hyderabad: హైదరాబాదీలకు వాన కబురు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!
హైదరాబాద్ లో గత కొద్ది రోజులు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరిలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తే.. ఇక మార్చి, ఏప్రిల్, మేలో పరిస్థితిలో ఎలా ఉంటుందోనని హైదరాబాదీలో భయపడుతున్నారు. అయితే వారికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.హైదరాబాద్ నగరంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
బంగాళాఖాతం నుంచి ఈశాన్య వాయుగుండం ఏర్పడటం, తేమ కారటం వల్ల తెలంగాణలోని తూర్పు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి 25-26 మధ్యకాలంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు తెలంగాణ విషయానికొస్తే ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌లో గత కొన్ని వారాలుగా వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాంపల్లి 37.6 డిగ్రీల సెల్సియస్, ఖైరతాబాద్ 37.2,
మోండామార్కెట్ 37.5 డిగ్రీల సెల్సియస్ నమోద్ అయ్యే అవకాశం ఉంది.
బన్సిలాల్‌పేట 37.7 డిగ్రీల సెల్సియస్, షేక్‌పేట 37.7, ఆసిఫ్‌నగర్ 37.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. ఇది సాధారణంగా కంటే ఎక్కువగా చెబుతున్నారు. ఉష్టోగ్రత పెరుగుతుండడంతో కరెంట్ వాడకం భారీగా పెరిగింది. ఏసీలు, కూలర్లు ఎక్కువ వాడుతుండడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. మరోవైపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్ నీటి సమస్యలు వస్తున్నాయి. నీరు లేక ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications