ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్: రద్దీ వేళల్లో రాయితీ కట్, ఆ కార్డుపై భారీ పెంపు
హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) షాకిచ్చింది. ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేసింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు.
సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జ్ కూడా భారీగా పెంచనున్నట్లు వెల్లడించారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై కోత విధించనున్నారు. ఏప్రిల్ 1 అంటే శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్డులపై డిస్కౌంట్ ఉండదు.

రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ రాయితీ అమలులో ఉండనుంది. ఇక సెలవు రోజుల్లో ప్రయాణించేందుకు ఇస్తున్న హాలీడే కార్డు ధర రూ. 59గా ఉండగా.. దీని ధరను రూ. 99కి పెంచనున్నారు. అంతేగాక, కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధరను కూడా భారీగా పెంచనున్నట్లు సమాచారం.
మెట్రో ఛార్జీలు పెంచే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. ఇప్పటికైతే ఛార్జీలు పెంచే అవకాశం లేదు. మంత్రి కేటీఆర్ కూడా మెట్రో ఛార్జీలు పెంచొద్దని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెట్రో అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications