Mega Princess: రాంచరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలోఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి.
మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది, హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మానించారు. ఉపాసన డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఆమెతో పాటు తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ కూడా హాస్పటల్‌కు వచ్చారు. కాగా, బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు నెలలు భార్య, కుతురుతో గడపనున్నారు.

కాగా, రాంచరణ్-ఉపాసనలకు 2012లో వివాహమైన విషయం తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గత డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. కాగా, కొద్ది రోజుల క్రితమే రాంచరణ్-ఉపాసన దంపతులు చిరంజీవి ఇంటి వచ్చిన విషయం తెలిసిందే.
సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని.. తాము దానికి పూర్తిగా భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలపడం గమనార్హం. ప్రస్తుతం తాను, రాంచరణ్.. అత్తామామలతో కాకుండా విఢిగా ఉంటున్నామని.. బేబీ పుట్టిన తర్వాత అత్తామామల(చిరంజీవి-సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని.. గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని ఉపాసన తెలిపారు. ఇక, చరణ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో దంపతులకు విషెస్ తెలుపుతున్నారు సినీ , రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు.












Click it and Unblock the Notifications