RTC: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు..!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని చాలా మంది డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. రూ.10 నుంచి లక్షల్లో ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ యాప్ లోత ఎక్కువగా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. భారత్ యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల్లో ఎక్కువ శాతం ఫోన్ పే నుంచి చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చిన డిజిటల్ చెల్లింపులు ఆర్టీసీలో మాత్రం అందుబాటులోకి రాలేదు.
తాజాగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే బస్సుల్లో క్యాష్ లెస్స్ లావాదేవీలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆర్టీసీ అధికారులు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సరంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలనుకున్నారు. కానీ కొన్ని సంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే జిల్లాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సుల్లో క్యాష్ లెస్స్ ఫోన్ పే, గూగుల్ పే క్యాఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే పుష్పక్ ఏసీ బస్సుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. ఇదే విధానం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లర సమస్య ఉండదు.
ఫోన్లు లేని వారు నగదు చెల్లించి కూడా టికెట్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ ఆర్టీసీ టీ 24 టికెట్ ధరలు పెంచింది. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ. 90 నుంచి రూ. 100కి పెంచేసింది. ఇక సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ. 90కి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టీ24 టికెట్ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో వివరించారు.












Click it and Unblock the Notifications